న్యాయమూర్తుల సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా రాజ గోపాల్
తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులుగా ఖమ్మం జిల్లా ప్రధానన్యాయమూర్తి జి. రాజగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల19న జరగనున్న అధ్యక్ష పదవికి ఆయన
ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో అధ్యక్షునిగా రాజ గోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు
ఎన్నికల అధికారిశశిధర్ రెడ్డి బుధవారం ప్రకటించారు. ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం ఇది
రెండో సారి. అదే విధంగా మహిళ ప్రతినిధిగా ఆర్థిక నేరాలు ప్రత్యేక న్యాయస్థానంలో
న్యాయమూర్తిగా పని చేస్తున్న జె.మైత్రి కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వెల్లడించారు.
మిగిలిన పదవులకు ఈనెల19న ఎన్నికలు జరుగుతాయని, 27న ఎన్నికల ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామని
తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన న్యాయమూర్తి జి. రాజగోపాల్ మాట్లాడుతూ
తనకు రెండో సారి అధ్యక్ష పదవి రావడం సంతోషంగా వుందన్నారు. న్యాయమూర్తుల సమస్యల
పరిష్కారానికి,
వారి నివాస సముదాయలు, నూతన
కోర్టుల ఏర్పాటుకు,
న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి, పదోన్నతుల కోసం కృషి చేస్తానని చెప్పారు.
.jpeg)
Comments
Post a Comment